News February 24, 2025
MLC ఎన్నికలు.. ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం

TG: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. NZB, ADB, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో INC తరఫున నరేందర్ బరిలో ఉన్నారు. దీంతో ఆయన తరఫున రేవంత్ ఉదయం 11.30 గంటలకు HYD నుంచి NZB చేరుకొని ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మ. 2 గంటలకు మంచిర్యాలలో, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు.
Similar News
News February 24, 2025
క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠ.. ఏం జరుగుతోంది?

TG: SLBC టన్నెల్‌లో ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, బురద, నీటి లీకేజీ కారణంగా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే ఆందోళన నెలకొంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సీఎం రేవంత్, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.
News February 24, 2025
‘ఛావా’ సంచలనం

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛావా’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ బాలీవుడ్‌లో రూ.100 కోట్లపైన వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ రూ.128 కోట్లు వసూలు చేయగా, ‘ఛావా’ రూ.109 కోట్లు రాబట్టినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
News February 24, 2025
ఏపీ అసెంబ్లీ వాయిదా

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు ఆయనను బయట వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. కాసేపటికే సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఇవాళ సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశారు.