News February 24, 2025

అల్లూరి: సిగ్నల్స్ రావడం లేదు..!

image

అల్లూరి జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కష్టాలు వీడటం లేదు. మండల కేంద్రమైన రాజవొమ్మంగిలో సైతం సిగ్నల్స్ ఉండటం లేదు. నిన్నటి రోజున ఇక్కడ సిగ్నల్స్ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. గత కొన్ని నెలలుగా ఈ సమస్య ఉందని వినియోగదారులు వాపోతున్నారు. డుండ్రిగుడ మండలంలోనూ సిగ్నల్స్ లేవని ఆరోపిస్తున్నారు. ఇంతకూ మీ ఏరియాలోనూ ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News December 29, 2025

సిద్దిపేట: ఈ మండలాల్లో మిషన్ భగీరథ నీళ్లు బంద్

image

మిషన్ భగీరథ మహ్మదాపూర్ ప్రధాన పంప్‌హౌస్‌లో పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు చేస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో ఈరోజు ఉ.6 నుంచి సా.5గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ EE రామ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట, కోహెడ, హుస్నాబాద్, భీమదేవరపల్లి మండలాల ప్రజలు సహకరించాలని కోరారు.

News December 29, 2025

రాజానగరంలో రేపు ‘జాబ్ మేళా’

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 30 మంగళవారం రాజానగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ స్కిల్ హబ్ ప్రాంగణంలో ఉదయం 10:30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 19 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండి.. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.

News December 29, 2025

శివాలయంలో చండీ ప్రదక్షిణే ఎందుకు చేయాలి?

image

శివాలయంలో సోమసూత్రం వద్ద శివగణాధిపతి చండేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. సోమసూత్రం దాటితే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుందని నమ్మకం. అలాగే శివ నిర్మాల్యం (పూలు, ప్రసాదం)పై పూర్తి అధికారం ఆయనదే. అందుకే గౌరవార్థం సోమసూత్రం దాటకుండా వెనక్కి మళ్లుతారు.