News March 21, 2024

ధర్మవరంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి వంశీకృష్ణను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 7, 2025

పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సీఎం పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతపురంలోని బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ప్రసన్నాయపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేసులు పాల్గొన్నారు.

News September 7, 2025

జోరుగా మహాలయ పున్నమి పండుగ

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహాలయ పున్నమి గురించి తెలియని వారుండరు. మాంసం ప్రియులకు ఇష్టమైన పండుగ ఇది. ఇవాళ మహాలయ పౌర్ణమి. వాడుకలో ఇది మాల పున్నమిగా ఉంది. ఇవాళ మటన్ తినడం పూర్వం నుంచి వస్తుందని పెద్దలు చెబుతారు. చంద్రుడిని చూస్తూ ముక్క తినాలంటారు. అందుకే తెల్లవారుజామునే పలు గ్రామాల్లో మటన్ వండుతారు. మాలపున్నమి కావడంతో మటన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.

News September 7, 2025

రైతులకు అవసరమైన యూరియాను అందించాలి: కలెక్టర్

image

రైతులకు అవసరమైన మోతాదులో యూరియాను అందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రైవేట్ వారికి 50శాతం, ప్రభుత్వ ఆధ్వర్యంలో 50శాతం విక్రయాలు జరిగేవన్నారు. ఈసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 70శాతం, ప్రైవేట్ ఆధ్వర్యంలో 30శాతం పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు. మండల అధికారులు రోజూ దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు.-