News February 24, 2025

మంచిర్యాల: CM రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి బయలు దేరి 11.50 నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి కరీంనగర్ బయలుదేరుతారు.

Similar News

News February 16, 2026

ఉమ్మడి నల్గొండలో ‘వరి’ జోరు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఏటికేడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా సాగు గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో వరి పంట సాగు ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది (11,13,472)తో పోలిస్తే ఈ 2026 యాసంగి (12,47,963) సీజన్లో ఏకంగా 1,34,491 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరగడం విశేషం.

News February 16, 2026

శ్రీకాళహస్తిలో భక్తురాలు మృతి: YCP

image

AP: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతిచెందినట్లు YCP ఆరోపించింది. శివరాత్రి రోజున శివయ్య దర్శనానికి వచ్చిన తిరుపతి(D) కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి అస్వస్థతకు గురైనట్లు చెప్పింది. సమాచారం ఇచ్చినా సకాలంలో 108 వెహికల్ రాలేదని, దీంతో ఆమె మృతిచెందినట్లు ట్వీట్ చేసింది. పండగ రోజు ఆలయాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని, ఈ పాపం ప్రభుత్వానిదే అని మండిపడింది.

News February 16, 2026

భీమేశ్వరాలయంలో లింగోద్భవ పూజలో పాల్గొన్న మంత్రి

image

వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో లింగోద్భవ సమయంలో నిర్వహించిన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి 11.35 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించి శ్రీ స్వామి వారి ప్రసాదం అందజేశారు.