News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558470>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్‌నగర్‌లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2026
వీఆర్‌ఎస్-3లో ఉక్కు యాజమాన్యం వెనుకడుగు..?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్‌ఎస్-3 విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో విడతకు 700 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 67 మందికే ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీఆర్‌ఎస్-1లో 1,126 మందికి, వీఆర్‌ఎస్-2లో 464 మందికి ఆమోదం లభించడంతో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందనే వీఆర్‌ఎస్‌కు పరిమిత సంఖ్యలో యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
భారత్ – బల్గేరియా ఫ్రెండ్షిప్ గ్రూప్.. సానా సతీశ్‌కు అరుదైన గౌరవం!

18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
News February 24, 2026
బాపట్ల జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ఛార్జీలు వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో అంబులెన్స్ రవాణా చార్జీల పోస్టర్‌ను ఆవిష్కరించి, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 7702806804 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.


