News February 24, 2025
ములుగు: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News September 17, 2025
పోడు భూములకు రుణాలివ్వండి: కామారెడ్డి కలెక్టర్

అర్హులైన రైతులకు, పోడు భూములకు పంట రుణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
News September 17, 2025
మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News September 17, 2025
12వేల మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు: కలెక్టర్

నల్లబర్లీ పొగాకు కొనుగోలులో అంతరాయం లేకుండా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 7,788 మంది రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 1,600 మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.