News February 24, 2025

HYD: 12 గంటల పాటు నిర్విరామ గానంతో రికార్డ్

image

గాయని ఓక్కరే సహా గాయకులు పదుల సంఖ్యలో పన్నెండు గంటల పాటు నిర్విరామ గానంతో ప్రేక్షకులచే ప్రశంపలు పొందారు. ఈ అపురూప విన్యాసానికి చిక్కడపల్లి గానసభ వేదిక అయింది. గాయని ఆనంద లక్ష్మి ఉదయం 8.05 నిమిషాలకు తన గానం ఆరంభించి రాత్రి 8.30 వరకూ నిరాటకంగా కేవలం పదిహేను నిమిషాలు వ్యవధి ఇస్తూ పన్నెండు గంటల పాటు సినిమా పాటలు, అన్నమయ్య కీర్తనలు ఆలపించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకెర్కారు.

Similar News

News November 9, 2025

కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

కర్నూలులోని నిర్మల్ నగర్‌‌లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

News November 9, 2025

తాజా వార్తలు

image

☛ పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. సంజీవని పథకం ద్వారా ఇంటి దగ్గరే వైద్యం అందిస్తాం. గ్రామాల్లో 5వేల వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తాం: CM చంద్రబాబు
☛ యాదగిరిగుట్టకు రూ.1,00,57,322 రికార్డ్ ఆదాయం. ఇవాళ ఆలయాన్ని దర్శించుకున్న 78,200మంది భక్తులు
☛ బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే అధికారం: మంత్రి లోకేశ్
☛ నిన్నటి దాకా CM రేసులో భట్టి ఉండేవారు. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు: జగదీశ్ రెడ్డి

News November 9, 2025

ములుగు: ముగిసిన సీతాకోక చిలుకల సర్వే

image

ఏటూరునాగారం అభయారణ్యంలో సీతాకోక చిలుకలు, చిమ్మటల సర్వే ముగిసింది. 8 రాష్ట్రాలకు చెందిన 60 మంది ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు అటవీ ప్రాంతంలో సీతాకోకచిలుకల జాడను అన్వేషించారు. ఐసీఏఆర్ ఎంటమాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చిత్రా శంకర్ ఆధ్వర్యంలో సర్వే నివేదికను డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్‌కు అందజేశారు. ములుగులో జరిగిన సర్వే ముగింపు కార్యక్రమంలో వారందరికీ ప్రశంస పత్రాలు అందించారు.