News February 24, 2025
గుండెపోటుతో ప్రభత్వ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో ప్రభత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. బోడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(60) ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు(60) టేకులపల్లి మం. ఎర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు.
Similar News
News November 3, 2025
డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.
News November 3, 2025
సిద్దిపేట: బీడీ కార్మికురాలి కొడుకుకి 4 ఉద్యోగాలు

బీడీ కార్మికురాలి కొడుకు పోటీ పరీక్షల్లో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడకు చెందిన రమేష్ గ్రూప్-2, 3, 4, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు పిడిశెట్టి రాజు ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ఇష్టంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లి దండ్రుల పేరు నిలబెట్టారని అన్నారు.
News November 3, 2025
ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

TG: ఇంటర్ కాలేజీల్లో అకాడమిక్ తనిఖీలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కాలేజీల్లో ప్రమాణాలను మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రైవేటు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో తనిఖీలు చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. కాలేజీల నిర్వహణ తీరు, రికార్డుల తనిఖీ, సిబ్బంది వివరాలు, విద్యార్థుల అటెండెన్స్‌ను పరిశీలించనున్నారు.


