News March 21, 2024

ఖమ్మం జిల్లా రైతు సోదరులకు ముఖ్య గమనిక

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 23, 24, 25వ తేదీల్లో మార్కెట్ అధికారులు సెలవులు ప్రకటించారు. 23న వారాంతపు యార్డ్ బంద్, 24న సాధారణ సెలవు, 25న హోలీ పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరిగి 26న మార్కెట్ పునఃప్రారంభమై క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

ఖమ్మం: స్త్రీనిధి బకాయిలపై మెప్మా నజర్

image

ఖమ్మం జిల్లాలో స్త్రీనిధి రుణాల వసూళ్లపై మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బకాయిల రికవరీని ముమ్మరం చేశారు. ఈ నెల 20లోపు రూ.25 లక్షల వసూలు లక్ష్యం కాగా, ఇప్పటికే రూ.23 లక్షలు రికవరీ చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తేనే మళ్లీ కొత్త రుణాలు అందుతాయని, బకాయిలు పడితే సంఘాలకు వచ్చే ఇబ్బందులపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

News March 11, 2026

KMM: నీరా కేఫ్‌ లీజుకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ‘నీరా కేఫ్‌’ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాల్లో నమోదై, నీరా సేకరణ అనుమతి ఉన్నవారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు వివరాల కోసం www.tgttcfc.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. గౌడ వృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 11, 2026

గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్‌.. విచారణకు ఆదేశం

image

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.