News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2025
SKLM: ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఉపాధ్యాయ MLC ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జెడ్పీ మందిరంలో ఈనెల 27న ఉపాధ్యాయ MLC ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఎపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.
News February 24, 2025
లక్ష ఉద్యోగాల భర్తీకి సిద్ధం: టీపీసీసీ చీఫ్

TG: ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 50 వేలు కూడా దాటలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం 9 నెలల్లోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
News February 24, 2025
కామారెడ్డి: హామీల అమల్లో సీఎం మోసం: ఎంపీ

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డిలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.