News February 24, 2025
NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

☞‘జల సాధన సమితి’ వ్యవస్థాపకుడు ఎవరు?
☞నాగార్జున సాగర్ ఎడమ కాలువని ఏమంటారు?
☞‘బండెనక బండి కట్టి’ గేయ రచయిత ఎవరు?
☞‘ప్రజల మనిషి’ నవలను ఎవరు రచించారు?
☞భువనగిరి కోటను ఎవరు నిర్మించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.
SHARE IT..
Similar News
News February 24, 2025
నల్గొండ: మహాశివరాత్రి.. మరో రెండు రోజులే!

శివరాత్రి వేడుకలు నల్గొండ జిల్లాలో ఘనంగా జరుగుతాయి. నల్గొండలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, బ్రహ్మంగారి గుట్టపై శివాలయం సహా పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయం, దామరచర్ల మండలం వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి దేవాలయాలు జాగారం చేసే శివ భక్తులతో మారుమోగుతాయి. ఇంకా పలు మండలాల్లో శివరాత్రి సందర్భంగా ఎడ్ల పందేలు, క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
News February 24, 2025
NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

☞‘జల సాధన సమితి’ <<15559616>>వ్యవస్థాపకుడు <<>>ఎవరు? – దుశర్ల సత్యనారాయణ
☞నాగార్జున సాగర్ ఎడమ కాలువని ఏమంటారు? – లాల్ బహదూర్ కాలువ
☞‘బండెనక బండి కట్టి’ గేయ ఎవరు రచించారు? – బండి యాదగిరి
☞‘ప్రజల మనిషి’ నవలను ఎవరు రచించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞భువనగిరి కోటను ఎవరు నిర్మించారు? – త్రిభువన మల్ల విక్రమాదిత్య(6)
SHARE IT..
News February 24, 2025
వేసవి ప్రారంభంలోనే మండుతున్న సూర్యుడు

నల్గొండ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్రమయ్యాయి. శీతాకాలం ముగియకముందే 20 రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనవరి చివరి వరకు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తీవ్రమైన చలి కనిపించింది. వేసవి ప్రారంభం కావడంతో ముదురుతున్న ఎండలకు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఆదివారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు నమోదు అయ్యాయి.