News February 24, 2025
పాపం ఆ 8 మంది.. ఎలా ఉన్నారో?

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎలా ఉన్నారో? అని సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారు అందులో చిక్కుకొని సుమారు 48 గంటలవుతోంది. ప్రమాదం జరిగిన 14వ కి.మీ వద్ద భీతావహ పరిస్థితిని చూసి రెస్క్యూ సిబ్బంది ఒకింత భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కానీ ఆశలు వదులుకోకుండా శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే వాటిని తొలగిస్తే పైకప్పు మళ్లీ కూలొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News February 24, 2025
కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారు: రేవంత్ రెడ్డి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని చెబుతుందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీ అని చెప్పుకునేందుకు బీఆర్ఎస్‌కు అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు.
News February 24, 2025
ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం: పెద్దిరెడ్డి

AP: అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని అడిగామని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే సానుకూల స్పందన రాలేదని చెప్పారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇవాళ సభకు హాజరైన YCP నేతలు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.
News February 24, 2025
50 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

TG: SLBC టన్నెల్ ఘటనలో 8 మంది చిక్కుకొని 50 గంటలు దాటింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బురదలో ఉన్న వ్యక్తులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌లో సేఫ్ కంటైనర్‌లోకి కార్మికులు వెళ్లుంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.