News February 24, 2025
డోర్నకల్: మార్గం మధ్యలో గుండెపోటుతో వ్యక్తి మృతి

డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో నల్ల ప్రభాకర్ (43) గుండెపోటుతో మృతి చెందాడు. కడుపు నొప్పి రావడంతో.. ఖమ్మంలో ఓ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News February 24, 2025
కరీంనగర్: పోలింగ్ సిబ్బంది రెఢీ

KNR, MDK, NJB, ADB ఉమ్మడి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మైక్రో అబ్జర్వర్లు 394, జోనల్ అధికారులు 335, పోలింగ్ అధికారులు 2,606, ప్రిసైడింగ్ అధికారులు 864 మందిని నియమించారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 680 ఏర్పాటు చేయగా, కామన్ పోలింగ్ స్టేషన్లు 93, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు 406, ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు 181 ఏర్పాటు చేశారు.
News February 24, 2025
కరీంనగర్: పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం: కలెక్టర్

ఈ నెల 27న జరిగే MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటన లో తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుండి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై నిషేధం అని తెలిపారు.
News February 24, 2025
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో బంగ్లా విజయంపైనే పాకిస్థాన్ CT సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
NZ: యంగ్, కాన్వే, విలియమ్సన్, రవీంద్ర, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, సాంట్నర్, హెన్రీ, జెమీసన్, ఓరౌర్కే.
BAN: హసన్, శాంటో, మిరాజ్, హృదయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, జాకర్, రిషద్, తస్కిన్, రాణా, రహ్మన్.