News February 24, 2025
కివీస్ గెలిస్తే పాకిస్థాన్ ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలవగా, బంగ్లా ఒకటి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఈ గేమ్ గెలిస్తే సెమీస్ బెర్తులు తేలిపోనున్నాయి. ఆ జట్టుతో పాటు ఇండియా చెరో 4 పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. పాకిస్థాన్, బంగ్లా ఇంటిదారి పడతాయి. కివీస్ ఓడితే ఆ రెండు జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయి.
Similar News
News February 24, 2025
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో బంగ్లా విజయంపైనే పాకిస్థాన్ CT సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
NZ: యంగ్, కాన్వే, విలియమ్సన్, రవీంద్ర, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, సాంట్నర్, హెన్రీ, జెమీసన్, ఓరౌర్కే.
BAN: హసన్, శాంటో, మిరాజ్, హృదయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, జాకర్, రిషద్, తస్కిన్, రాణా, రహ్మన్.
News February 24, 2025
ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకాలు

TG: ఆర్టీసీలో డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి సంస్థ సిద్ధమైంది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజిలో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 1,500 మంది నియామకానికి సర్క్యులర్ జారీ చేసింది. 4 నెలల కాలానికే వీరిని నియమించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది 3వేల డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు చేసినా నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది.
News February 24, 2025
లక్ష ఉద్యోగాల భర్తీకి సిద్ధం: టీపీసీసీ చీఫ్

TG: ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 50 వేలు కూడా దాటలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం 9 నెలల్లోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.