News February 24, 2025
పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. బీపీఎం శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, డాక్ సేవక్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3.
వెబ్ సైట్: indiapostgdsonline.gov.in
Similar News
News February 24, 2025
పాకిస్థాన్‌లో HIGH ALERT.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్?

పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(TTP), ISIS, బలూచిస్థాన్ గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో CTపై ప్రభావం పడే అవకాశం ఉంది.
News February 24, 2025
అసంతృప్తికరంగా రేవంత్ పాలన: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో 14 నెలల రేవంత్ ప్రభుత్వ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రొటీన్‌గా చెల్లించాల్సిన బిల్లుల్లో సీలింగ్ పెట్టడం దారుణమన్నారు. కళాశాలల యాజమాన్యాల పట్ల సీఎం తీరు బాగాలేదన్నారు.
News February 24, 2025
3 రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.