News February 24, 2025
HYD: ‘విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ’

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొ.వెంకటదాస్ చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డీఏటీఏ ఆవిర్భవించడం ఆనందాయకమన్నారు. యుటీసీ, ఏఐసీటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.
Similar News
News September 14, 2025
GNT: నేడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న వకుల్ జిందాల్

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీఓలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
News September 14, 2025
మైథాలజీ క్విజ్ – 5

1. 8 దిక్కులు మనకు తెలుసు. మరి 10 దిశల్లో మరో రెండు దిశలు ఏవి?
2. గోదావరి నది ఏ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో జన్మించింది?
3. వసంత పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. అంబ ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శిఖండిగా పుట్టింది?
5. జనకుడికి నాగలి చాలులో ఎవరు కనిపించారు? (సరైన సమాధానాలను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
– <<17690127>>మైథాలజీ క్విజ్-4<<>> ఆన్సర్స్: 1.శివుడు 2.రావణుడు 3.కేరళ 4.పూరీ జగన్నాథ ఆలయం 5.వరాహ అవతారం
News September 14, 2025
ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలత, శాంతిని పెంచుతుందని అంటున్నారు. ‘దక్షిణ దిశలో గడియారం ఉంచడం అశుభం. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు’ అని సూచిస్తున్నారు.