News February 24, 2025
పల్నాడు: కోటప్పకొండ జాతరకు రహదారులు సిద్ధం

నరసరావుపేటలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పురస్కరించుకొని జరిగే త్రికోటేశ్వరస్వామి జాతరకు రహదారులు సిద్ధమయ్యాయి. 10 రోజులుగా ప్రభుత్వ శాఖలు కొండకు వచ్చే రహదారులలో మరమ్మతులు చేపట్టాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, పెట్లూరు వారిపాలెం, జేఎన్టీయూ, పమిడిమర్రు, గురవాయపాలెం కాలువ కట్ట రోడ్లు, గిరి ప్రదక్షిణ మార్గాలు వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వచ్చాయి.
Similar News
News February 24, 2025
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

ఈ నెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆల్ పార్టీస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆమెతో పాటు ఎస్పీ జానకి షర్మిల, పలువురు నాయకులు ఉన్నారు.
News February 24, 2025
వల్లభనేని వంశీ కేసులో కీలక అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం మూడు రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించాలని సూచించింది. అలాగే వంశీకి వెస్ట్రన్ టాయిలెట్స్, మంచం సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
News February 24, 2025
పాకిస్థాన్‌లో HIGH ALERT.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్?

పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(TTP), ISIS, బలూచిస్థాన్ గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో CTపై ప్రభావం పడే అవకాశం ఉంది.