News February 24, 2025
అసెంబ్లీ సమావేశాలు.. ఆంక్షల విధింపు

AP: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయడం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. పరిసరాల్లో సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు, సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్‌లు రద్దు చేశారు.
Similar News
News February 24, 2025
ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదు: రేవంత్

TG: కేసీఆర్ ఇక రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ MLC ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు ఏమీ చేయని BRS ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్లకు ఏం చేశారు? టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఎందుకు చేపట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 24, 2025
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: జగన్

AP: సభలో చర్చించేందుకు సమయం ఇవ్వాల్సి వస్తుందనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ఎక్కడా తగ్గం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. కళ్లు మూసి తెరిచేలోగా జమిలి ఎన్నికలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News February 24, 2025
జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.