News February 24, 2025

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

image

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.

Similar News

News February 24, 2025

జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

image

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

News February 24, 2025

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

ఈ నెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆల్ పార్టీస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆమెతో పాటు ఎస్పీ జానకి షర్మిల, పలువురు నాయకులు ఉన్నారు.

News February 24, 2025

వల్లభనేని వంశీ కేసులో కీలక అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం మూడు రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించాలని సూచించింది. అలాగే వంశీకి వెస్ట్రన్ టాయిలెట్స్, మంచం సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

error: Content is protected !!