News February 24, 2025

మా కుటుంబ గొడవలకు ముగింపు రావాలి: మంచు విష్ణు

image

తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని హీరో మంచు విష్ణు చెప్పారు. అలాంటి వాతావరణంలో పిల్లలు పెరగాలనేది తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఫ్యామిలీలో గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే ఎన్ని జన్మలైనా తండ్రిగా మోహన్‌బాబే ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదాలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Similar News

News September 13, 2025

సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.

News September 13, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,43,000గా ఉంది. రెండు రోజుల్లో కేజీ సిల్వర్‌పై రూ.3వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 13, 2025

ముంబై పేలుళ్ల కేసు.. రూ.9 కోట్లు ఇప్పించాలని నిర్దోషి డిమాండ్

image

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.