News February 24, 2025
అల్లూరి: రేపటి నుంచి వైన్ షాపులు క్లోజ్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో వైన్ షాపుల మీద ఆంక్షలు విధించారు. ఈ నెల 25సాయంత్రం 5 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సుధీర్ ఆదేశించారు. పాడేరు డివిజన్‌లో 22, రంపచోడవరంలో 10, చింతూరులో 8 దుకాణాలకు తమ సిబ్బంది సీలు వేస్తారని చెప్పారు. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవన్నారు.
Similar News
News September 18, 2025
వరంగల్ మార్కెట్లో ధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలివచ్చాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,500 ధర వస్తే.. పచ్చి పల్లికాయకు రూ.4,100 ధర వచ్చింది. అలాగే మక్కలు (బిల్టీ) రూ.2,280 ధర పలికింది. 5531 రకం మిర్చి క్వింటా రూ.13,200, దీపిక మిర్చి రూ.14 వేలు, పసుపు రూ.10,659 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News September 18, 2025
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారి 65పై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. పైనుంచి వెళ్లడంతో ఆమె శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 18, 2025
వరంగల్: తుపాకీ పట్టారు.. తూటాకు బలయ్యారు..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్ వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నేతలు అమరులవుతున్నారు. ఇప్పటివరకు జనగామకు చెందిన గుమ్మడవెల్లి రేణుక, భూపాలపల్లికి చెందిన గాజర్ల రవి, వరంగల్‌కు చెందిన మోదెం బాలకృష్ణతో పాటు సుధాకర్, ఏసోలు, అన్నై సంతోశ్, సారయ్య, ఇలా ఒక్కొక్కరుగా ఉద్యమ బాటలో ఊపిరి వదులుతున్నారు.