News March 21, 2024
HYD: గవర్నర్‌తో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం

నిన్న జరిగిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు గవర్నర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రభుత్వానికి సహకరించాలని భట్టి గవర్నర్‌ను కోరారు.
Similar News
News March 4, 2026
ఇరాన్‌తో HYDకు స్పెషల్ ATTACHMENT..!

ఇరాన్‌తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ పేరుతో బంజారాహిల్స్‌లో కాన్సులేట్, రోడ్డు, పాతబస్తీలో ఇరానీ గల్లీ కూడా ఉందంటే ఇరాన్‌తో HYDకున్న రిలేషన్‌ను అర్థం చేసుకోవచ్చు.
News March 3, 2026
హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది!

హోలీ పండుగ, గ్రహణం ఉండటంతో నగరంలో రోడ్లు, బస్సులు వెలవెలబోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్ల వద్దే కుటుంబాలతో పండుగ జరుపుకోవడంతో బయట రాకపోకలు తగ్గాయి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు బస్సుల్లో ప్రయాణికులు లేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రంగుల సందడి కాలనీలకే పరిమితమైంది. బండ్ల పొగ లేక నగరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.
News March 3, 2026
‘బ్లాక్‌చైన్ బస్తీ’గా పాతబస్తీ?

చార్మినార్ పరిసరాల్లోని యువత ఇప్పుడు బిర్యానీ కబుర్ల కంటే ‘బ్లాక్‌చైన్’ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న ఇంటర్నెట్ సెంటర్లలో డిజిటల్ లెడ్జర్స్, క్రిప్టో కోడింగ్‌పై వర్క్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం ఇక్కడి కుర్రాళ్లు ఫ్రీలాన్సింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తూ పాతబస్తీ యువత డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది భవిష్యత్తులో HYDకు కొత్త గుర్తింపు తీసుకురావడం ఖాయం.


