News February 24, 2025
అనకాపల్లి జాతరపై పవన్‌కు వినతి

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2025
ATP: PGRS కార్యక్రమంలో 502 అర్జీలు

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొని ప్రజల నుంచి 502 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PGRS అర్జీలను సంబంధిత గడువులోపే పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ ఉంచరాదని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులంతా జవాబుదారీతనంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం చూపొద్దని వివరించారు.
News February 24, 2025
కామారెడ్డి: CM రేవంత్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పూలబొకేను ఇచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు ఉన్నారు.
News February 24, 2025
సంగారెడ్డి: రంజాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసే చోట్ల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పి రూపేష్, అధికారులు పాల్గొన్నారు.