News February 24, 2025
బెల్లంపల్లి: 2 రోజులు మద్యం షాపులు బంద్

MLC ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నట్లు బెల్లంపల్లి ఎక్సైజ్ CIఇంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఈనెల 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 18, 2025
జమ్మూకశ్మీర్‌పై సరైన సమయంలో నిర్ణయం: అమిత్ షా

జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. లద్దాక్ విషయంలో లేవనెత్తిన డిమాండ్లకు సరైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అయితే వారు ఓపికగా ఉండాలని కోరారు. బిహార్‌లోని పట్నాలో ఓ మీడియా కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో సమూల మార్పులు జరిగాయని, గత 9 నెలల్లో స్థానికంగా ఒక్క టెర్రరిస్టు రిక్రూట్‌మెంట్ కూడా జరగలేదని చెప్పారు.
News October 18, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⤇ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులందరిదీ ఒకటే జెండా, అజెండా.. అధికారం లేదన్న అసహనంతోనే క్యాబినెట్‌పై బీఆర్ఎస్ ఆరోపణలు: మంత్రి శ్రీధర్ బాబు
⤇ కరీంనగర్(D) గంగాధర, జగిత్యాల(D) ధర్మపురిలో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
⤇ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGPICS)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ
News October 18, 2025
ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా కల్చర్ సాగు చేసేవారు కచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధి చేయుటకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపారు. లైసెన్సుల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.