News February 24, 2025
టన్నెల్ ఘటన.. ‘నీరో చక్రవర్తి’లా రేవంత్ వ్యవహారం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది ఆచూకీ తెలియని స్థితిలో MLC ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నిమగ్నమవ్వడం దిగజారుడు రాజకీయమేనని కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనపై సీఎంకే సీరియస్‌నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.
Similar News
News February 24, 2025
CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.
News February 24, 2025
KCR, హరీశ్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో BRS అధినేత KCR, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై భూపాలపల్లి క్రిమినల్ కోర్టు కేసీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.
News February 24, 2025
YS జగన్ కీలక నిర్ణయం

AP: శాసనసభకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. MLAలు, MLCలతో భేటీలో జగన్ ఈ విషయం వెల్లడించారు. మండలిలో బలం ఉన్నందున MLCలు హాజరుకావాలని ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. మండలిలో సమస్యలను బలంగా ప్రస్తావించాలన్నారు. YCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.