News February 24, 2025
సంగారెడ్డి: వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా వారణాసి వద్ద టిప్పర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి(46), ఆయన భార్య విలాసిని (40), న్యాల్ కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
పారదర్శకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు: కలెక్టర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీవోలు శిక్షణ తరగతులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 27న చేపట్టే పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆకళింపు చేసుకొని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
News February 24, 2025
గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్చరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.
News February 24, 2025
జిల్లాలో 144వ సెక్షన్ అమలు: భూపాలపల్లి కలెక్టర్

ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు.