News February 24, 2025
సచివాలయ ఉద్యోగులపై కీలక నిర్ణయం

AP: రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో భర్తీ చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను రద్దు చేసి రిజిస్ట్రేషన్ల శాఖ మనుగడకు చేయూతనిచ్చామన్నారు. జనాభా ప్రాతిపదికన సచివాలయాల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Similar News
News February 24, 2025
YS జగన్ కీలక నిర్ణయం

AP: శాసనసభకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. MLAలు, MLCలతో భేటీలో జగన్ ఈ విషయం వెల్లడించారు. మండలిలో బలం ఉన్నందున MLCలు హాజరుకావాలని ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. మండలిలో సమస్యలను బలంగా ప్రస్తావించాలన్నారు. YCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News February 24, 2025
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 856 పాయింట్ల నష్టంతో 75,454 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 22,553 వద్ద ఎండ్ అయ్యాయి. M&M, రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, కొటక్ మహీంద్ర సంస్థల షేర్లు భారీ లాభాలను అందుకున్నాయి. విప్రో, HCL, TCS, ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
News February 24, 2025
కేసీఆర్, కేటీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది: సీఎం రేవంత్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌ను బీజేపీ కాపాడుతోందని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని బెదిరించడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని అన్నారు. ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడారు.