News March 21, 2024
ఈ ఏడాది కొత్త కెప్టెన్లు వీరే..

ఈ ఏడాది ఐపీఎల్‌లో పలు జట్లకు కెప్టెన్లు మారారు. గుజరాత్ కెప్టెన్‌గా గిల్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్, ముంబైకి హార్దిక్ పాండ్య, SRHకి కమిన్స్ బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఆయా జట్లకు కెప్టెన్లుగా చూడటం ఇదే తొలిసారి. ఈ జట్లన్నీ గతంలో ఐపీఎల్ ట్రోఫీ విజేతలే కావడం గమనార్హం. మరోవైపు ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పంత్‌కు గతంలో ఇదే టీమ్‌కు సారథ్యం వహించిన అనుభవం ఉంది.
Similar News
News April 3, 2025
పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది: సునీత

AP: YCP అధినేత జగన్‌పై MLA పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది. ఆ కేసులో CBI ఆయన్ను విచారించింది. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారు. ఓబుల్‌రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారు. ఆ సోదరుల మాటలు నమ్మి కుట్రలో భాగస్వామ్యం కావొద్దు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దు జగన్’ అని సునీత హెచ్చరించారు.
News April 3, 2025
గిల్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!

నిన్నటి మ్యాచులో ఆర్సీబీపై విజయం తర్వాత గుజరాత్ కెప్టెన్ గిల్ చేసిన పోస్ట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. మ్యాచ్ అనంతరం ‘అరవడంపై కాదు ఆట మీదే మా ధ్యాసంతా’ అని గిల్ ట్వీట్ చేశారు. అంతకుముందు గిల్ ఔటయ్యాక కోహ్లీ బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిని ఉద్దేశించే గిల్ పోస్ట్ చేశారని, టీమ్ ఇండియాలో మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఆయనే అంటూ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
News April 3, 2025
BREAKING: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జడ్జిల ఆస్తుల వివరాలు ప్రజలకు తెలిసేలా కోర్టు వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో మొత్తం 33 మంది జడ్జిల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణ సుప్రీంకోర్టుకు భవిష్యత్‌లో వచ్చే జడ్జిలకూ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల జడ్జి యశ్వంత్ వర్మ(ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి) ఇంట్లో భారీగా నోట్లకట్టలు లభ్యమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.