News February 24, 2025
వంశీపై పీటీ వారెంట్

AP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.
Similar News
News February 24, 2025
CHECK NOW.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు జమ చేస్తారు. ఇవాళ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.22వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన వారి అకౌంట్లలోనే డబ్బులు జమ అయ్యాయి. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <
News February 24, 2025
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో ఊర్వశీ రౌతేలా?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు టాక్. నెక్స్ట్ షెడ్యూల్‌లో ఆమె షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ మూవీలో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
News February 24, 2025
11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా?: షర్మిల

AP: సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా అని ఆమె విమర్శించారు. ‘జగన్‌కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.