News February 24, 2025
ఆ ‘నవ్వు’ ఆగి నాలుగేళ్లు అయింది!!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఒకప్పటి రెగ్యులర్ టాపిక్ మనకు ఇప్పుడు మరుగున పడింది. కానీ అక్కడి రణభూమి రగులుతూనే ఉంది. నేటితో మూడేళ్లు పూర్తైన ఈ యుద్ధంతో వేల మంది సైనికులు చనిపోయారు, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మిలియన్ల మంది రేపు అనేది ఏమిటో తెలియక ఇతర దేశాల్లో శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. ప్రతి గడియ గండంగా గడుపుతున్న ఆ దేశాల వాసులు నవ్వి నాలుగేళ్లు. ఈ నెత్తుటి క్రీడ ఆగేది, ఆరేది ఎప్పుడో?
Similar News
News February 24, 2025
11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా?: షర్మిల

AP: సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా అని ఆమె విమర్శించారు. ‘జగన్‌కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.
News February 24, 2025
ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో గత పదేళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘గతంలో TDP, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRSలో చేర్చుకోలేదా? వారిని మంత్రులను చేయలేదా? అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి. అప్పటి కోర్టులే కదా ఇప్పుడు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు తరచుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
News February 24, 2025
CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.