News February 24, 2025

KMR: గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు

image

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా నోడల్ అధికారి నాగేశ్వర్ రావు సోమవారం ‘Way2News’తో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు 7,481 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 7,282 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారన్నారు. 97.34% హాజరు శాతం నమోదైనట్లు వెల్లడించారు.

Similar News

News February 24, 2025

నిజామాబాద్: నరేందర్ రెడ్డిని గెలిపించండి: ముఖ్యమంత్రి

image

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి మండలిలో పట్టభద్రుల సమస్యలపై గొంతుకను వినిపిస్తారని అన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యల వాణికి వినిపిస్తారని పేర్కొన్నారు.

News February 24, 2025

జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఉద్యోగులకు ప్రత్యేకసెలవు: కలెక్టర్

image

ఈనెల 27న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్‌మెంట్ అథారిటీల్లో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటుహక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులకు సైతం ఓటుహక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలన్నారు.

News February 24, 2025

గ్యాస్ పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు: జేసీ

image

దీపం పథకం కింద సరఫరా చేస్తే గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి హెచ్చరించారు. కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే విచారణ నిర్వహిస్తామన్నారు.

error: Content is protected !!