News February 24, 2025
కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. కోనసీమలోని 22 మండలాల్లో 64,471 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో పురుషులు 37,114 మంది, మహిళా ఓటర్లు 27,355 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News February 24, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: NZ టార్గెట్ ఎంతంటే?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 236/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శాంటో (77), జాకిర్ అలీ (45) రాణించారు. NZ బౌలర్లలో బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టగా, రూర్కీ 2, హెన్రీ, జెమీసన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే బంగ్లాదేశ్‌తో పాటు పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
News February 24, 2025
ఆసిఫాబాద్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

శివరాత్రి రోజున నిర్వహించే జాతరకు ఆసిఫాబాద్ డిపో నుంచి 28 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. వాంకిడి జాతరకు ఆసిఫాబాద్ నుంచి 3 బస్సులు, కాగజ్ నగర్ నుంచి ఈస్గామ్ 6, బెల్లంపల్లి నుంచి బుగ్గకు 15, ఆసిఫాబాద్ నుంచి నంబాలకు 4 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 24, 2025
విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం