News February 24, 2025
క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠ.. ఏం జరుగుతోంది?

TG: SLBC టన్నెల్లో ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, బురద, నీటి లీకేజీ కారణంగా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే ఆందోళన నెలకొంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సీఎం రేవంత్, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.
Similar News
News February 24, 2025
జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదా?

AP: మాజీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సెషన్లో సభ్యులు చేసిన సంతకాలను పరిగణనలోకి తీసుకోరని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శాసనసభకు రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని అంటున్నారు. దీంతో జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని సమాచారం.
News February 24, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: NZ టార్గెట్ ఎంతంటే?

న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 236/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శాంటో (77), జాకిర్ అలీ (45) రాణించారు. NZ బౌలర్లలో బ్రేస్వెల్ 4 వికెట్లు పడగొట్టగా, రూర్కీ 2, హెన్రీ, జెమీసన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే బంగ్లాదేశ్తో పాటు పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
News February 24, 2025
విద్యుత్ షాక్తో నలుగురు మృతి

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం