News February 24, 2025
వైభవంగా నూకాంబిక జాతర రాట ఉత్సవం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానంలోని బాలాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కొత్త అమావాస్య జాతర సందర్భంగా ముహూర్తం రాట మహోత్సవం జరిగింది. దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.సుజాత, దేవాదాయ డీసీ ఆఫీస్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుధారాణి, ఈవో శేఖర్ బాబు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 24, 2025
యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు దేవస్థానం వారు సోమవారం శుభవార్త చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు టోల్గేట్ రుసుము మినహాయింపు ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రుడు తెలిపారు. అలాగే విచ్చేయు భక్తులకు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
News February 24, 2025
కర్లపాలెం: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం సమీపంలో కొత్త నందాయపాలెంకి చెందిన రైతు సుబ్బారెడ్డి మిర్చి పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో బోరు స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 24, 2025
చిత్తూరు యువతి హీరోయిన్‌గా అరంగేట్రం

చిత్తూరు జిల్లాకు చెందిన సౌందర్య రవికుమార్ తమిళ చిత్రంలో తళుక్కుమన్నారు. నటన పట్ల ఆసక్తిగల సౌందర్య తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అసిస్టెంట్ బాలు పులిచెర్ల దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ కే దాస్ చిత్రంలో సౌందర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కుమార్తె సౌందర్య చిన్ననాటి నుంచి కళల రంగంలో రాణిస్తోంది.