News February 24, 2025

గాంధారి: పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: నోడల్ అధికారి

image

ఈ నెల 5 నుంచి ప్రారంభమై ఇంటర్ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగారం, అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్ కుమార్, సరిత, సుజాత, రమేశ్ పాల్గొన్నారు.

Similar News

News February 24, 2025

త్వరలో నెస్లే ఇండియా ఉత్పత్తుల ధరలు పెంపు

image

తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాలని Nestle India యోచిస్తోంది. కాఫీ, కోకో, వంట నూనెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ MD సురేశ్ నారాయణన్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అధిక ఉత్పత్తి ధరల కారణంగా తమకు లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గించడంతో వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయని, దీంతో తమ ఉత్పత్తుల వినియోగం పెరిగే ఛాన్సుందని అంచనా వేశారు.

News February 24, 2025

వికారాబాద్: 93ఎకరాల భూమి.. 62మందికి చెక్కులు

image

పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందించామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. 93.16 ఎకరాల భూమికి 62 మంది రైతులకు నష్టపరిహారం అందించామన్నారు.

News February 24, 2025

ఏడాదిలో 300 రోజులు అదే తింటా: మోదీ

image

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు.

error: Content is protected !!