News February 24, 2025

రెబ్బెన: పుష్పవతి కావడం లేదని యువతి SUICIDE

image

పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News July 4, 2025

సిరిసిల్ల: ‘బడ్జెట్ కూర్పులో ఘనపాటి’

image

బడ్జెట్ కూర్పులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఘనపాటి అని బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు.

News July 4, 2025

గద్వాల జిల్లా పోలీసులకు 12 పతకాలు: ఎస్పీ

image

జోగులాంబ జోనల్-7 స్థాయి పరిధిలో రెండు రోజులు నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన “పోలీస్ డ్యూటీ మీట్”లో గద్వాల జిల్లా పోలీస్ అధికారులు ప్రతిభ కనబరిచి 12 పతకాలు సాధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 3 బంగారు, 6 రజత, 3 కాంస్య పతకాలు ఉన్నాయని చెప్పారు. వాటిని జిల్లా పోలీసు అధికారులు జోగులాంబ జోన్ -7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

News July 4, 2025

KNR: 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ల సస్పెండ్

image

కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను మేనేజ్మెంట్ సస్పెండ్ చేసింది. డాక్టర్స్ డే రోజు జరిగిన కార్యక్రమంలో తమ పెండింగ్ స్టైఫండ్‌ నిధులను రిలిజ్ చేయాలని నిరసన వ్యక్తం చేసినందుకే తమని సస్పెండ్ చేశారని విద్యార్థులు వాపోయారు.