News February 24, 2025
సిరిసిల్ల: వ్యక్తిపై కేసు నమోదు: ఎస్పీ

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వేములవాడ దేవాలయానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నూనె ముంతల రవీందర్ గౌడ్ (43) పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీ పేలుడు ఘటన.. కాజీపేట రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను సీఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులను, అనుమానితులను, వారి లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సీఐ సూచించారు.
News November 10, 2025
ఢిల్లీలో పేలుళ్లు.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
News November 10, 2025
TU అధికారులు వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలి: AISF

TUలో 2012లో ఉద్యోగ నోటిఫికేషన్లో జరిగిన నియామకాలను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును TU అధికారులు వెంటనే అమలు చేయాలని AISF యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ టీయూ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ వెంటనే స్పందించాలన్నారు.


