News February 24, 2025
ధ్రువీకరించని లోన్ యాప్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

ధ్రువీకరించని లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఆర్. గంగాధర్ ప్రకటనలో తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోయినా, సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఇస్తామంటూ ఆకర్షిస్తారు. వ్యక్తిగత సమాచారం దోచేసి తిరిగి మిమ్మల్ని బెదిరించి మీ వద్ద నుంచి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారని అన్నారు. సైబర్ నేరానికి గురైనప్పుడు 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News February 24, 2025
కృష్ణా జిల్లాలో 48 గంటలు మద్యం దుకాణాలు బంద్

కృష్ణా జిల్లాలో ఈ నెల 27వ తేదీన MLC ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాలో మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీన సాయంత్రం 4 వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసి వేయాలన్నారు. ఉత్తర్వులను బేఖాతరు చేస్తే సంబంధిత మద్యం దుకాణాల లైసెన్స్‌లు రద్దువతాయని హెచ్చరించారు.
News February 24, 2025
బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే.!

పోలవరం కాలువలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. కోడూరుపాడుకు చెందిన సుభానీ, జానీ కుమారులు నాగూర్ బాషా, షరీఫ్, సుభానీతో కలిసి చేపలకు వేటకు వెళ్లారు. చేపల గాలం చిక్కుకుపోవడంతో దాన్ని తీసేందుకు నాగూర్ బాషా వెళ్లగా, మునిగిపోతున్న సమయంలో పైకి లాగేందుకు షేక్ షరీఫ్ చెయ్యి ఇవ్వగా ఇద్దరు మునిగిపోయారు. బయటకు తీసేందుకు ప్రయత్నించినా అప్పటికే ప్రాణాలు విడిచారు.
News February 24, 2025
MTM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరపైకి వైసీపీ

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు తాము పోటీలో ఉండమని చెప్పి వైసీపీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల తెరపైకి వచ్చింది. పార్టీపరంగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా PDF అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ MLC KS లక్ష్మణరావుకు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. కూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.