News March 21, 2024
నెల్లూరు: ఆ నియోజకవర్గంలో గెలిస్తే రికార్డే..

సూళ్లూరుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినా.. గెలిచిన దాఖలాలు లేవు. 1983లో కాంగ్రెస్ నుంచి M.లక్ష్మీకాంతమ్మ పోటీ చేయగా..TDP అభ్యర్థి S.ప్రకాశం చేతిలో ఓడిపోయారు. 2009లో V.సరస్వతి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా..TDP అభ్యర్థి పరసా వెంకటరత్నం చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో TDP తరఫున నెలవల విజయశ్రీ.. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. విజయశ్రీ గెలిచి రికార్డు సృష్టిస్తారా?
Similar News
News February 25, 2026
నెల్లూరు: 27న ట్రై స్కూటీల కోసం ఇంటర్వ్యూలు

ఈనెల 27న ట్రై స్కూటీల మంజూరుకు విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలో ట్రై స్కూటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులోని JC ఛాంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
News February 25, 2026
నెల్లూరు: రెండో రోజు 899 మంది ఆబ్సెంట్.!

నెల్లూరు జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ మాల్ ప్రాక్టీసింగ్‌కు తావు లేకుండా పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వరప్రసాద్ రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 27,790 మంది విద్యార్థులకు గాను 26,891 మంది హాజరయ్యారని 899 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
News February 25, 2026
ఆ భూములను కాపాడండి: అసెంబ్లీలో సోమిరెడ్డి

సర్వేపల్లిలో హైవే పక్కన రూ.100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి సమీక్ష చేయాలి’ అని ఆయన విన్నవించారు.


