News February 24, 2025
పెద్దపల్లి: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య బీమా, రైల్వే పాస్, కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు. నిత్యం వివిధ రాజకీయ నాయకులు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని, వారి కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు.
Similar News
News February 24, 2025
కాలినడకన తిరుమలకు చేరుకున్న సినీనటి నిహారిక

ప్రముఖ సినీ నిర్మాత, నటి నిహారిక కొణిదెల సోమవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ముందుగా అలిపిరి వద్ద పాదాల మండపంలో పూజ చేసి అనంతరం కాలినడకన సన్నిహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. ఆమె రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం వేకువజామున తోమాల సేవలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.
News February 24, 2025
యూజీసీ జేఆర్ఎఫ్ సాధించిన ఏయూ విద్యార్థి

ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ విద్యార్థి శ్యామ్ యూజీసీ జేఆర్ఎఫ్ సాధించాడు. దివ్యాంగుడైన శ్యామ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిభ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ జేఆర్ఎఫ్ సాధించడం పట్ల విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్యామ్‌ని విభాగంలో సత్కరించారు. శ్యామ్ నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు.
News February 24, 2025
SSS: ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి- కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహిస్తున్న రీసర్వే పనులపై ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఫ్రీ హోల్డ్‌కు సంబంధించిన అంశాలను ఈనెల 28వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.