News February 24, 2025

జగిత్యాల: యూరియా కోసం రైతుల ఇబ్బందులు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటకు చివరి దశలో యూరియా చల్లడానికి రైతులకు బస్తాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అరకొరగా వస్తున్న యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద కాపలా కాస్తున్నారు. సోమవారం జగిత్యాల, మల్లాపూర్‌కు యూరియా రాగా రైతులు అధికసంఖ్యలో రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.

Similar News

News September 18, 2025

విశాఖలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య

image

మాకవరపాలేనికి చెందిన శివానీ జోత్స్న (21) MBBS సెంకండ్ ఇయర్‌ చదువుతోంది. ఫస్ట్ ఇయర్‌లో బ్యాక్‌లాగ్స్ ఉండడంతో వాటిని క్లియర్ చేయలేనేమోనని ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే బుధవారం సుజాతానగర్‌లోని తన మేనమామ ఉంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలిచగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 18, 2025

HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్‌కార్డు ఖాళీ చేశాడు!

image

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్‌లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్‌ ఇన్‌స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.

News September 18, 2025

NTR: రూ.42 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

image

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు సింగ్‌నగర్‌కు చెందిన వృద్ధుడిని మోసం చేశారు. ఈ నెల 11న సైబర్ నేరగాళ్లు సత్యనారాయణ మూర్తికి ఫోన్ చేసి భయపెట్టారు. ఈ క్రమంలో అతని బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.42 లక్షలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.