News February 24, 2025
మద్యం దుకాణాలు 48 గంటలపాటు బంద్: కలెక్టర్

ఈ నెల 27వ తేదీన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలు మూసివేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఛీప్ ఎలక్టోరల్ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 25 సాయంత్రం 4.00 గంటల నుంచి 27 సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలన్నారు.
Similar News
News January 15, 2026
నేడు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరపూజ మహోత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. స్వామి వారికి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వరపూజ కత్రువు సంక్రాంతి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మేలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేడు వరపూజ, నిశ్చయ తాంబూల స్వీకరణ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు.
News January 15, 2026
ప,గో: న్యాయస్థానంలో ఉద్యోగ అవకాశాలు

ఉమ్మడి ప.గో లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా జడ్జ్ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఏలూరు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
News January 15, 2026
ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో నారావారిపల్లెలో ఉన్న ఆయన క్లస్టర్ యూనిట్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఆదాయం వచ్చేలా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఇంటర్నెట్, క్యాబిన్లు, క్యాంటిన్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు.


