News February 24, 2025

సిర్పూర్(టి): అప్పు తీర్చలేక వ్యక్తి సూసైడ్

image

సిర్పూర్(టి) పెద్ద బండ సమీపంలోని భీమన్న ఆలయం వద్ద ఓ వ్యక్తి ఆదివారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడు కాగజ్‌నగర్‌లోని కాపు వాడకు చెందిన వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. మద్యం షాపు టెండర్ల కోసం అప్పు చేశాడని, అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News November 12, 2025

కష్టాలు ఎన్ని రకాలంటే..?

image

మనుషులు పడే కష్టాలను వేదాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అందులో మొదటిది ఆధ్యాత్మిక దుఖాలు. శరీరంలో కలిగే రోగాలు, కోపం, కపటం, బద్ధకం వల్ల అంతర్గతంగా ఏర్పడతాయి. రెండవది ఆది భౌతిక దుఃఖాలు. ఇవి పంచభూతాలు, శత్రువులు, జంతువులు, కీటకాల వంటి బయటి జీవుల వల్ల కలుగుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఇవి ప్రకృతి శక్తులైన అతివృష్టి, అనావృష్టి, పిడుగులు, గ్రహబాధల వల్ల సంభవిస్తాయి. వీటిని దాటడమే మోక్షం. <<-se>>#VedikVibes<<>>

News November 12, 2025

18 నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.

News November 12, 2025

వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

image

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్‌లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.