News February 24, 2025

పాకిస్థాన్‌లో HIGH ALERT.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్?

image

పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(TTP), ISIS, బలూచిస్థాన్ గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో CTపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Similar News

News February 24, 2025

కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి UP వెళ్లిన AP బృందం

image

AP: 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తోంది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

News February 24, 2025

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ప్లేయర్

image

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె అవతరించారు. ఇప్పటివరకు పెర్రీ 835 పరుగులు సాధించారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్(782) రికార్డును ఆమె తుడిచిపెట్టేశారు. యూపీతో జరుగుతున్న మ్యాచులో ఆమె ఈ ఫీట్ నెలకొల్పారు. కాగా ఐపీఎల్‌లోనూ అత్యధిక పరుగుల రికార్డు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (8,004) పేరిట ఉన్న విషయం తెలిసిందే.

News February 24, 2025

అలాంటప్పుడు ఎన్ని పదవులు వచ్చినా వేస్ట్: పవన్ కళ్యాణ్

image

AP: ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో, ఏ పరమాత్మ అయితే స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం అని Dy.CM పవన్ అన్నారు. ‘నేను మూర్ఖంగా వాదించే హిందువును కాదు. కానీ లౌకిక వాదం పేరుతో హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నమ్మకాలపై పదే పదే దాడులు చేస్తుంటే నాకు ఇబ్బంది అనిపించింది. దీని వల్ల ఓట్లు వస్తాయా పోతాయా అనే లెక్కలు వేసుకోను’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

error: Content is protected !!