News February 24, 2025

జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

image

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

Similar News

News February 24, 2025

CM రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

image

TG: చీకటి ఒప్పందాలు చేసుకునే అవసరం BJPకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. BRS, BJP కుమ్మక్కయ్యాయని CM రేవంత్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘మేము నీతి నిజాయితీతో బతికేవాళ్లం. మీలాగా కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగేవాళ్లం కాదు. మీలా పార్టీలు మారలేదు. దయ్యమన్న సోనియాను దేవత అంటూ వెళ్లి కాళ్లు పట్టుకోలేదు’ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగిస్తే విచారణ ముందుకు వెళ్తుందని అన్నారు.

News February 24, 2025

ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు

image

AP: ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని దినేశ్ కుమార్‌‌ను ఆదేశించింది. మరోవైపు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కాగా ఫైబర్‌నెట్‌కు చెందిన పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఎండీని జీఏడీకి అటాచ్ చేసినట్లు సమాచారం.

News February 24, 2025

మార్చి 21న ‘సలార్’ రీ రిలీజ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సలార్’ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 21న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దీనికి పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

error: Content is protected !!