News February 24, 2025
YS జగన్ కీలక నిర్ణయం

AP: శాసనసభకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. MLAలు, MLCలతో భేటీలో జగన్ ఈ విషయం వెల్లడించారు. మండలిలో బలం ఉన్నందున MLCలు హాజరుకావాలని ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. మండలిలో సమస్యలను బలంగా ప్రస్తావించాలన్నారు. YCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 12, 2025
ఢిల్లీ బ్లాస్ట్‌కు టెలిగ్రామ్‌తో లింక్!

ఢిల్లీ బ్లాస్ట్‌లో కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా రాడికల్ డాక్టర్లు గ్రూపుగా ఏర్పడి సమాచారాన్ని చేరవేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ యాప్‌పై ఎప్పటినుంచో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. కంటెంట్ నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ యాప్ బ్యాన్ చేయాలనే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.
News November 12, 2025
‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.
News November 12, 2025
18 రోజులు.. ఈసారి మహాభారతమే

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.


