News February 24, 2025

భువనగిరి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. వీరారెడ్డిపల్లికి చెందిన మంద చంద్రయ్య అప్పుల బాధతో మనోవేదనకు గురై పంట పొలానికి తెచ్చిన పురుగు మందును తాగాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. 

Similar News

News September 17, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News September 17, 2025

తుని: 108 వాహనంలో మహిళ ప్రసవం

image

తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన మల్లి ఆశకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పాయకరావుపేట 108 సిబ్బంది ఆమెను తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కవ కావడంతో మెడికల్ టెక్నీషియన్ శ్రీనివాస్ చికిత్స అందించి అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

News September 17, 2025

ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.