News February 24, 2025

ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో గత పదేళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘గతంలో TDP, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRSలో చేర్చుకోలేదా? వారిని మంత్రులను చేయలేదా? అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి. అప్పటి కోర్టులే కదా ఇప్పుడు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు తరచుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 12, 2025

‘Mom my first love’.. టాటూ చూసి డెడ్‌బాడీ గుర్తింపు

image

ఢిల్లీ బ్లాస్ట్‌‌లో మరణించిన వారి డెడ్‌బాడీలను గుర్తించడం కష్టతరంగా మారింది. టాటూలు, టీ షర్టు ఆధారంగా తమ ఆత్మీయుల మృతదేహాలను గుర్తించారు. చాందినీ చౌక్‌లో ఫార్మా బిజినెస్ చేసే 34 ఏళ్ల అమర్ కటారియా బ్లాస్ట్‌లో మరణించాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతని డెడ్‌బాడీని చేతిపై ఉన్న ‘Mom my first love’, ‘Dad my strength’ టాటూల ఆధారంగా సోమవారం రాత్రి మార్చురీలో కుటుంబసభ్యులు గుర్తించారు.

News November 12, 2025

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

image

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.

News November 12, 2025

బ్యాంకుకు ‘లంచ్ బ్రేక్’ ఉంటుందా?

image

బ్యాంకు సర్వీస్‌లో లంచ్ బ్రేక్ ఉండదు. RBI ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్‌డ్ టైమ్ లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ మూసివేయకూడదు. లంచ్‌ సమయంలోనూ ఎవరో ఒకరు రొటేషనల్ పద్ధతిలో కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్ బ్రేక్‌ పేరుతో ఇబ్బంది పడితే RBI కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది. SHARE