News February 24, 2025

11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా?: షర్మిల

image

AP: సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా అని ఆమె విమర్శించారు. ‘జగన్‌కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News February 25, 2025

WPL: యూపీ ‘సూపర్’ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 9 రన్స్ టార్గెట్‌‌తో బరిలోకి దిగిన ఆర్సీబీని ఆ జట్టు 4 పరుగులకే కట్టడి చేసింది. యూపీ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టన్ సూపర్ ఓవర్‌లో కేవలం 4 పరుగులే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన సోఫీ 19 బంతుల్లో 33 రన్స్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకొచ్చారు.

News February 25, 2025

WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. బెంగళూరు, యూపీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌‌కు దారి తీసింది. తొలుత RCB 180 రన్స్ చేసింది. ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరగనుంది.

News February 25, 2025

ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

image

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!