News February 24, 2025
గ్యాస్ పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు: జేసీ

దీపం పథకం కింద సరఫరా చేస్తే గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి హెచ్చరించారు. కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే విచారణ నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 25, 2025
సజావుగా ఎన్నికలు నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పిఒ, ఎపిఓ, ఓపిఓ, రూట్, సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ సరళి మాత్రమే చూసుకుంటే సరిపోదని, అనవసర వ్యక్తులను పోలింగ్ స్టేషన్ పరిధిలోకి రాకుండా, వారిని నియంత్రించే బాధ్యత కూడా చేపట్టాలని ఆదేశించారు.
News February 25, 2025
ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.
News February 25, 2025
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

* కృష్ణ: 48 గంటలు మద్యం దుకాణాల బంద్ * కంకిపాడులో దారి దోపిడీ ముఠా అరెస్ట్ * కృష్ణా: ధ్రువీకరించని యాప్‌స్‌తో జాగ్రత్త: SP * బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే * విజయవాడ: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి * కృష్ణా: PDF అభ్యర్థికి జగన్ మద్దతు * శివరాత్రికి సిద్ధమవుతున్న యనమలకుదురు * గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ముగ్గురి అరెస్ట్